మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
11వ కార్మెల్ ఛాంపియన్ ట్రోపి ఇంటర్ స్కూల్ క్రీడల్లో కార్మెల్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ప్రతిభను కనపరిచారని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ లిజ్ డెత్ తెలిపారు. బుధవారం లిజ్ బెత్ మాట్లాడుతూ కార్మెల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ మరియ అగస్టీన్ ఆధ్వర్యంలో ఈనెల 10, 11 తేదీలలో మంచిర్యాల గుడి పేటలో నిర్వహించిన 11వ ఇంటర్ స్కూల్ కార్మెల్ మీట్ లో కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో, త్రో బాల్, అథ్లెటిక్స్, పోటీలలో కార్నల్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ప్రతిభను కనబరిచి ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకున్నారని తెలిపారు. కార్మెల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఏడు కార్మెల్ పాఠశాలల్లో పాలకుర్తి కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ప్రతిభను కనబరిచి ఛాంపియన్ సాధించడం పట్ల సొసైటీ అధ్యక్షురాలు మరియ ఆగస్టీన్ విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మెర్లిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్లు శ్రీనివాస్, రాణాప్రతాప్, తిరుమల్ రావు , సంధ్యారాణి, జ్యోత్స్న, జగదాంబ పాల్గొన్నారు.