Breaking News

రసాభాసాగా మారిన గ్రామసభలు..

  • అయోమయంలో అర్హులు.
  • వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు.

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

అర్హులకు కాకుండా.. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం తో గ్రామసభలో వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం నడికూడ మండల కేంద్రంలో ఇంచార్జ్ ఎంపీడీవో చేతన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్ హాజరయ్యారు..

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఈ సందర్భంగా గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించకపోవడంతో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హులకే కేటాయించాలని కోరారు. దీనితో పరకాల సిఐ. క్రాంతి కుమార్ జోక్యం చేసుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి శాంతింప జేశారు. ఇదే ఫైనల్ లిస్ట్ కాదని ఏదైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలపాలని సూచించారు.