మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో రాణించాలని కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు ఎడవెల్లి సోంమల్లయ్య అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు. క్రీడలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాయం శోభారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై సోంమలయ మాట్లాడారు. విద్యార్థుల విద్యార్థులు వివిధ రకాల ఆటలు ఆడడం ద్వారా శారీరక మానసిక అభివృద్ధి ఉల్లాసం కలుగుతుందని అన్నారు. సందర్భంగా సోం మల్లయ్య పాఠశాలకు 10 పదివేల రూపాయలు బహుమతి ప్రధానం చేశారు. విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న 10 రూపాయల బహుమతులను అందజేసి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించిన సోంమల్లయ్యకు పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు శోభారాణి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఓరుగంటి రమేష్ , సోంమల్లు ,బలరాం, నరసింహమూర్తి, వెంకటయ్య, మెహరుణ్ణిసా బేగం, మాలతి, అన్నపూర్ణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.