Breaking News

ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పోస్ట్ చేస్తే కఠినమైన చర్యలు

  • కడియం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి రిమాండ్
  • వర్ధన్నపేట సీఐ కొమ్మూరి శ్రీనివాసరావు
    మన ప్రగతి న్యూస్/ జఫర్‌గడ్:
    ఎవరైనా ఇతర వ్యక్తుల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని వర్ధన్నపేట సీఐ కొమ్మూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై జనవరి 21 రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలు ఆడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మనోభావాలని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వర్ధన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కుక్కల పరుశురాములపై ఫిర్యాదు రాగా ఈనెల 22వ తేదీన జఫర్‌గడ్ ఎస్సై కేసు నమోదు చేయగా వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు శుక్రవారం కుక్కల పరుశురాములు ను రిమాండ్ చేసి జైలుకు పంపించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం