Breaking News

అలంకారప్రాయంగా క్రీడా ప్రాంగణాలు..!

  • కొత్త సర్కారైనా పట్టించుకోవాలంటున్న మండల ప్రజలు
  • ప్రాంగణాలు ఇలా.. ఆడేదెల.?
  • మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణం రెండు ఎకరాలలో ఏర్పాటు చేయాలని అంటున్న ప్రజలు

మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :

గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఆటలపై మక్కువ పెంచి, క్రీడల్లో రాణించాలన్న సంకల్పంతో ప్రభుత్వం నెలకొల్పిన క్రీడా ప్రాంగణాలు అలంకార ప్రాయంగానే మిగులుతున్నాయి. ప్రతీ పంచాయతీలో కచ్చితంగా క్రీడా మైదానం ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించి నెలకొల్పిన క్రీడా ప్రాంగణాలు పేరుకు మాత్రమే అన్నట్లు ఉండటంతో అతీ గతీలేకుండా పోతున్నాయి.

క్రీడా బోర్డు ఓకే.. మరి వసతులేవి..?

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఉపాధి హామీ పథకంలో భాగంగా స్థలాలు గుర్తించి ఆటలకు ప్రతిపాదనలు పంపాక నిధులు మంజూరయ్యాయి. అప్పటి వరకు గ్రామాల్లో క్రీడా మైదానాలు లేక ప్రైవేట్‌ స్థలాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో ఆడుకునే యువతీ యువకులు, క్రీడా ప్రాంగణాల్లో ఆడుకోవచ్చని సంబురపడ్డారు. క్రీడా ప్రాంగణాల బోర్డులు చూసి త్వరలో క్రీడా సామగ్రి, పరికరాలు వస్తాయని ఆశించారు. రెండేళ్లు దాటుతున్నా, ఏ క్రీడా ప్రాంగణంలోనూ పరికరాల ఊసేలేదు. కేవలం క్రీడా ప్రాంగణాల బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల్ని పోత్సాహించాలంటే ఆ గ్రామంలో ఉన్న గ్రౌండ్‌లను శుభ్రపరచాల్సిన పరిస్థితి ఉంది. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్కూల్‌ గ్రౌండ్‌లను క్రీడా ప్రాంగణాలుగా మార్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం గత సర్కారు చేసిన తప్పిదాలు చేయకుండా గ్రామీణ ప్రాంతాల చివరన ఏర్పాటు చేసిన గ్రౌండ్‌లను సౌకర్యాలు మెరుగుపరిచి అందుబాటులోకి తేవాలి అని ప్రజలు అంటున్నారు.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు సౌకర్యాలు సరిగ్గా లేక నిరుపయోగంగా ఉన్నాయి. దీనివల్ల గ్రౌండ్‌లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్రు . యువత చెడు అలవాట్లకు బానిస అయ్యే విధంగా ఉంది. ప్రభుత్వం క్రీడా వస్తు సామగ్రిని త్వరితగతిన అందించడం ద్వారా ఆటల పట్ల ఆసక్తి పెంచాలి.గ్రామీణ క్రీడాకారుల ప్రోత్సాహానికి క్రీడా ప్రాంగణాలు నెలకొల్పాలన్న ప్రభుత్వ సంకల్పం మంచిదే అయినా, ఆచరణ లేకపోవడంతో క్రీడాకారులకు ఉపయోగం లేని పరిస్థితి తలెత్తింది. మైదానాలు ఏర్పాటు చేసినా ఆ ప్రాంగణాల్లో మౌలిక వసతులు, క్రీడా పరికరాలు, సామగ్రి లేకపోవడం వల్ల ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. కొత్త ప్రభుత్వమైనా దృష్టి సారించి, క్రీడా ప్రాంగణాల్లో సౌకర్యాలు, పరికరాలు అందించి వినియోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు.