Breaking News

నందికొండ మున్సిపాలిటీ కొన సాగింపా, తొలగింపా

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లో నందికొండ మున్సిపాలిటీ గా గత ప్రభుత్వం హయాంలో 2018 లో ఏర్పాటు చేయటం జరిగింది. అపుడు కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు కోసం ఒక ప్రాజెక్టు ఏరియాను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయటం జరిగిందని నాగార్జున సాగర్ లో మొత్తం 12 వార్డులలో రెండు కాలనీలో 16000 వేల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీ ఏర్పడి రెండు సంవత్సరాల తర్వాత 2022 జనవరి 26 మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి 12 మంది కౌన్సిలర్లను ప్రజలు ఎన్నుకున్నప్పటికి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సొంత నిధుల కన్నా ప్రభుత్వం నుంచే ఎక్కువగా వచ్చేవి. మెజార్టీ ప్రజల అభిప్రాయం ప్రకారం మున్సిపాలిటీ కంటే ముందుగా గ్రామ పంచాయతీ చేసుంటే బాగుండేదని అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యేవని ఇపుడు సొంత నిధులు లేక ప్రభుత్వం మీద పూర్తిగా ఆధారపడాల్సి వస్తుందని ఇప్పటి వరకు ప్రభుత్వ నిధులతోనే నడిపించటం జరుగుతుందని ఎందుకంటే ఇక్కడ ఆస్తి పన్ను,ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్సులు ఇవ్వాలంటే ఎక్కువగా షాపుల సముదాయం ఉండాలి అదికాక మున్సిపాలిటీ లో ఏ విధంగా ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసే సరైన సిబ్బంది లేరని పట్టణ అధికారి మాత్రం వారానికి ఒక సారి చుట్టం చూపుగా వచ్చి వెలుతుంటాడని ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ఎన్నెస్పీ అధికారుల నుంచి అనుమతి తప్పకుండా తీసుకోవాలి డ్యాం అధికారుల పర్యవేక్షణలో ఉన్నపుడే నాగార్జున సాగర్ బాగుండేదని మున్సిపాలిటీ అయిన తర్వాత జీవన విధానం లో ఎలాంటి మార్పులు లేవని రాజకీయ అండదండలతో కొంతమంది కౌన్సిలర్లు అక్రమంగా బాగానే సంపాదించుకున్నారని మరి కొంతమంది అప్పుల పాలుఅయ్యారని స్థానిక ప్రజలు అన్నారు.ఇపుడు ఈ నందికొండ మున్సిపాలిటీ జనవరి 26 తో పరిపాలన గడువు ముగుస్తుండటంతో మున్సిపాలిటీ ని యధావిధిగా కొనసాగిస్తారా లేక ప్రత్యేక అధికారిని నియమించి పాలనను కొనసాగిస్తారా అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం