మనప్రగతి న్యూస్/ మంగపేట:మంగపేట పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏటూరునాగారం. సి. ఐ. ఎ.శ్రీనివాస్, ఎస్ ఐ టీవీఆర్ సూరి గంజాయి నిందితుల గురించి తెలిపిన వివరాల ప్రకారం మంగపేట పోలీసులు గురువారం రాత్రి కమలాపూర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని విచారించగా వారు మొరం కుమార్ తండ్రి మాసయ్య ,వయసు ( 25) వాజేడు మండలం, వావిలాల సంతోష్ తండ్రి పోషాలు, వయసు (24) వెంకటాపురం, నరందాసరి ప్రవీణ్ కుమార్ తండ్రి బాలు, వయసు (19)వెంకటాపురం అని తెలిపి వారి దగ్గర ఉన్న బ్యాగు చెక్ చేయగా దాంట్లో 2.5 కేజీ కిలోల గంజాయిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగిందని తెలిపారు.వారిని శుక్రవారం జ్యూడిషియల్ కస్టడీకి పంపించడం జరిగిందని తెలిపారు.పట్టుకున్న గంజాయి యొక్క విలువ 63000 అని తెలిపారు. గంజాయి పట్టుకున్న పోలీసు అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత చెడు అలవాట్లకు బానిస అవుతున్నారని తల్లిదండ్రుల గుర్తించి వారిని సరైన మార్గంలో పయనించే విధంగా బాధ్యతతో వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోవాలని గంజాయి అమ్మిన సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని, గంజాయి వివరాలు తెలిపిన వారికి సరైన పారితోషికం ఇవ్వడం జరుగుతుందని వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుందని సిఐ తెలిపారు.సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ చుక్కయ్య కానిస్టేబుల్స్ మోహన్ ,ప్రసాద్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
