Breaking News

ముగిసిన ప్రజా పాలన సభలుఅర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తహసిల్దార్ పి. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని టి ఎస్ కే తండా, పెద్ద తండా ( కె), కిష్టాపురం తండా, వల్మిడి, దుబ్బ తండా (ఎస్ పి), హత్య తండా, చెన్నూరు చెన్నూరు గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజా పాలన గ్రామ సభను ప్రత్యేక అధికారులు తాసిల్దార్ పి శ్రీనివాస్, ఎంపీడీవో ఏ.రాములు, డిప్యూటీ తహసిల్దార్ ఆర్.వేణుకుమార్, ఆర్ డబ్ల్యూఎస్ డి ఈఈ  కె.సంధ్య, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ  ఎన్.ప్రశాంతి, ఆర్.శరత్ చంద్ర,ఎం పి ఓ రవీందర్ లు పాల్గొని గ్రామపంచాయతీ కార్యాలయం లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు నిర్వహించిన సమావేశాలకు హాజరై ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, రైతు భరోసా పథకాలకు సంబంధించిన ముసాయిదాను‌ ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు చదివి వినిపించారు. ఆయా పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితా ను గ్రామ సభ ఆమోదం పొందిన తరువాత అర్హుల జాబితా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామసభల్లో పాల్గొన్న అధికారులు  మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు అందుతాయన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములను గుర్తించామన్నారు.వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందుతుందన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రభుత్వం అందిస్తుందన్నారు. నాలుగు ప్రభుత్వ పథకాల కోసం ముసాయిదాలో పేర్లు లేనట్లయితే గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  హెల్ప్ డిస్క్ ల వద్ద  దరఖాస్తు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుం
దన్నారు. ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామపంచాయతీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ల వద్ద ప్రజలు పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిబ్బంది సహాయ పడాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రజల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

-జాబితా ఎంపికపై అధికారంలను నిలదీసిన్న పెద్దతండా గ్రామ ( కె) గిరిజనులు

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మండలంలోని పెద్దతండా( కె) గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ప్రస్తుతం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను సంబంధించి చాలా అవుకతోకలుగా ఉన్నాయంటూ నిజమైన అర్హుల పేర్లు జాబితాలో లేవంటూ గిరిజనులు ఆందోళనకు దిగారు. రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల జాబితాలు తప్పుడు తడకలా ఉన్నాయంటూ ఆందోళనకు దిగారు.