_ స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్
మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్ తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ పరిధిలో చౌరస్తా వద్ద హెల్మెట్ ధరించిన వాహనదారులకు పూలు అందించి అభినందించారు.ఈ సందర్భంగా వాహనదారులకు తెలుపుతూ వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని తెలిపారు. అతి చిన్న వయసు యువతీ యువకులకు బైకులు ఇవ్వద్దని తెలిపారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలని సూచించారు.