మన ప్రగతి న్యూస్/ మల్లంపల్లి
నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండల పాలన కార్యాలయంను ప్రారంభించిన మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ.
శుక్రవారం ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండలంను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంలో తహసీల్దారు కార్యాలయంను రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండా సురేఖ, ఎంపీ బలరాంనాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ లతో కలసి ప్రారంభించారు.
అంతకుముందు 33 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ గోదాంను మంత్రులు ప్రారంభించారు.