గుట్టయ్యకు పిసిసి మహేష్ హామీ..
మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు:
పార్టీ కోసం కష్టపడ్డ వారికి త్వరలో చేపట్టే నియామకాలలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తమకు హామీ ఇచ్చినట్లు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో శుక్రవారం మహేష్ గౌడ్ ను కలిసి పార్టీ కమిటీ లో,లేనిపక్షంలో నామినేటెడ్ పదవులలో తనకు అవకాశం కల్పించాలని అభ్యర్థించినట్లు తెలిపారు. తాను 15 సం.లుగా బీసీ నేతగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశానని,ఎలక్షన్లలో భువనగిరి పార్లమెంటు ఇన్చార్జిగా పార్టీకి విజయం చేకూర్చినట్లు ఆయన దృష్టికితీసుకువెళ్లానన్నారు.అంతకుమునుపు మహేష్ గౌడ్ ను సత్కరించినట్లు చెప్పారు.