Breaking News

డఫోడిల్స్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

పట్టణంలోని డఫోడిల్స్ సి బి ఎస్ ఇ పాఠశాలలో చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో జాతీయ నాయకులను అనుకరించారు.

దేశభక్తి గీతాలతో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతుల్ని అబ్బురపరిచాయి.ఎన్సిసి విద్యార్థులు చూడచక్కగా పరేడ్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ మాట్లాడుతూ భారతీయులకు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు పీల్చుకునే అవకాశం దక్కిందని ,మనకోసం మనం ఏర్పరచుకున్న రాజ్యాంగం ఈరోజు అమల్లోకి వచ్చిందని తెలిపారు. భారతీయుల ఆశలు ,ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని, ప్రపంచంలోనే మన రాజ్యాంగం చాలా గొప్పదని కితాబునిచ్చారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రతి భారతీయుడు గర్వపడే సమయం రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అని అన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ప్రతి ఒక్కరిని స్వేచ్ఛ, సమానత్వంతో గుర్తించింది మన రాజ్యాంగం అన్నారు. రాజ్యాంగం అమలయ్యే దినాన్ని రిపబ్లిక్ డే గా పిల్చుకుంటామన్నారు. భారతీయుల ఆశయాలకు ఆకాంక్షలకు ప్రతిబింబం మన రాజ్యాంగం అన్నారు. తోటి వారిని గౌరవించుకుంటూ సమాజంలోని పెద్దలపట్ల గౌరవభావంతో నడుచుకోవాలని విద్యార్థులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన, ప్రధానోపాధ్యాయులు అజీమ్ పాషా ,హెచ్ ఓ డి విజయలక్ష్మి, రిట మేడం, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు ,విద్యార్థులు పాల్గొన్నారు.