Breaking News

ఏన్కూర్ లో ఘనంగా బ్రహ్మంగారి కళ్యాణం మహోత్సవం

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ఏన్కూర్ లోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో బుధవారం గోవిందమాంబ సమేత బ్రహ్మం గారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన కేసుపల్లి, ఏన్కూరులలోని బ్రహ్మం గారి దేవాలయాలలో బ్రహ్మంగారి కళ్యాణాన్ని జరపటం ఆనవాయితీ. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మంగారి కళ్యాణాన్ని ఘనంగా జరిపారు. ఉదయం నుంచే ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం