Breaking News

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఝాన్సీ రెడ్డి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం హనుమాండ్ల ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో ఎనిమిది వేల మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

హనుమండ్ల ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 వేల మంచినీటి బాటిల్లను భక్తులకు అందించామన్నారు. ప్రతి ఒక్కరూ సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలు చేసినప్పుడే ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, వి ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మొలుగూరి యాకయ్య గౌడ్,నాయకులు గుగ్గిళ్ళ ఆదినారాయణ, మారం శ్రీనివాస్, పోగు శ్రీనివాస్,ఎండి మదర్, బొమ్మగాని భాస్కర్ గౌడ్, నలమాస రమేష్ గౌడ్, గోనె మహేందర్ రెడ్డి, గాదపాక భాస్కర్, నిరటి చంద్రయ్య, కమ్మగాని నాగన్న గౌడ్, పెనుగొండ రమేష్, లావుడియా భాస్కర్ నాయక్, నునావత్ హరిలాల్ నాయక్, కామారపు సునీల్, ఎండి యాకూబ్,తదితరులు పాల్గొన్నారు.