శివనామ స్మరణం తో మారు మ్రోగిన శైవ క్షేత్రం
పోటెత్తిన భక్తజనం
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణంతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల హరిహరుల దివ్య క్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం మారు మ్రోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసిం
హస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది.

బుధవారం అర్ధరాత్రి నుండి ప్రారంభమైన అభిషేకాలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరిగింది.పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు వేరువేరుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారికి ఆలయ అర్చకులు ఆశ్రవచనాలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు గర్భిణి స్త్రీలు, వృద్ధులు, వికలాంగుల కోసం ఉచిత వాహనాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో సిఐలు గట్ల మహేందర్ రెడ్డి, శ్రీనివాస రావులు, ఎస్ఐలు దూలం పవన్ కుమార్, లింగారెడ్డి, యాకోబు హుస్సేన్, రాజు, సృజన్ కుమార్, బండి శ్రావణ్, శ్రావణ్ ల తో కలిసి భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కొండపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించలేదు. జాతరలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో డిఎస్ వెంకన్న నేతృత్వంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, డి ఆర్ డి ఓ పి డ వసంత, డిపిఓ స్వరూప, సి ఎఫ్ ఓ లక్ష్మీ ప్రసన్న లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో డాక్టర్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మెట్ల మార్గంలో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఎన్సిసి వాలంటీర్లు బందోబస్తులో పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా స్టేషన్ ఘన్పూర్ రాంబాబు, ఏడిఏ శ్రీనివాస్, ఏఈ ఆవిరినేని రణధీర్, బోయని సత్తయ్య లు నివారణ చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు 63 కెవి జనరేటర్ లను ఏర్పాటు చేసుకున్నారు.

త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ డీఈ సంధ్య, ఏఈ ప్రశాంతిలు ప్రజలకు త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. జాతరలో పరిశుభ్రతను పాటించేందుకు పరిశుద్ధ కార్మికులు నిరంతరం శ్రమించారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుండి భక్తులు సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామని దర్శించుకునేందుకు తరలివచ్చారు .ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, ఆలయ సూపరిండెంట్ కొత్తపల్లి వెంకటయ్య తోపాటు ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
