Breaking News

22,397 మంది గ్రాడ్యుయేట్లు.. 950 మంది టీచర్లు

_ ఓటు హక్కు వినియోగించుకోవాలి :

_ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల,

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు ఈ నెల 27 (గురువారం)వ తేదీన ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్దమవుతుంది. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి అయింది.గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 56.. టీచర్ అభ్యర్థులు 15..
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ స్వీకరించారు. 22,397 మంది గ్రాడ్యుయేట్లు.. 950 మంది టీచర్ ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తరువాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు 56 కాగా, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీల్లో ఉన్న అభ్యర్థులు 15 బరిలో ఉన్నారు. జిల్లాలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్స్ కలిపి మొత్తం 185 మందిని కేటాయించారు. జిల్లా పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలతోపాటు బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో కలిపి మొత్తం 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు 28, టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు 13 కేంద్రాలు గుర్తించారు.
జంబో పోలింగ్ బాక్స్ లు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు వేములవాడ ఆర్డీవో, సిరిసిల్ల ఇన్ ఛార్జ్ ఆర్డీవోలు రాజేశ్వర్, రాధాభాయి ఐదు రూట్లు, ఐదు జోన్లు గా విభజించి ఐదుగురు సెక్టార్ ల ఆద్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం జంబో పోలింగ్ బాక్స్ లు, టీచర్ల ఎన్నిక కోసం రెగ్యులర్ పోలింగ్ బాక్స్ లు వినియోగిస్తున్నారు.
_ అధికారులు, సిబ్బందికి శిక్షణ
పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, సిబ్బందికి పోలింగ్ ఫై మరోసారి శిక్షణ ఇచ్చారు. ఓటు వేసే విధానం, బ్యాలెట్ బాక్స్ లు సీల్ వేయడం తదితర అంశాలఫై తర్ఫీదు ఇచ్చారు. కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

_ ఓటు హక్కు వినియోగించుకోవాలి సందీప్ కుమార్ ఝా

జిల్లాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్లు సంబంధిత పత్రాలు వెంట తీసుకొని వెళ్లి తప్పకుండా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. పోలింగ్ అధికారులు సూచించిన విధంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని 41 ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాము.