మనప్రగతి న్యూస్ /బయ్యారం

బయ్యారం మండలం లోని దామర చెరువు నుండి కోటగడ్డ వరకు ఇటీవల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన తారు రోడ్డు వారం తిరగక ముందే పెచ్చులు గా ఊడిపోవటాన్ని చూసి స్థానికులు,రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు.ఇదేంటి ఇంత అన్యాయమా..? ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.పన్నుల రూపంలో కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేసి ప్రజాపాలన సక్రమంగా చేస్తారని అనుకోవడం భ్రమ మాత్రమే ఇదిగో ఇలా గుత్తేదారులకు దోచిపెట్టడం కోసమేనని వారు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.తారు రోడ్డు నిర్మాణంలో కనీస మందం 6 ఇంచులు లేనిదే రోడ్డు మన్నిక ఎక్కువకాలం నిలవని పరిస్థితి. అలాంటిది కేవలం ఒక్క ఇంచు మందం తారు వేయడంతో రైతులు పండించిన పంట నిత్యం ఇదే రహదారి పై ట్రాక్టర్ ద్వారా రవాణా చెయ్యాల్సిన పరిస్థితి .నాణ్యత లేని రోడ్డు వాటి తాకిడికి తిరోగమనం చెందటం ఖాయమని రైతులు అంటున్నారు

.అంతేకాదు డస్ట్,ఎక్కువగా మట్టి కలిసిన నాసిరకం కంకర ఉపయోగించడం కూడా జరిగిందని, దాని వల్ల రోడ్డు ఎలా పటుత్వం ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు,స్థానికులు కోరుతున్నారు.
నాసిరకం నిర్మాణాలకు కారకులు ఎవరు..?
బయ్యారం మండల పరిధిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ద్వారా మండల వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు,సైడ్ డ్రైనేజీలు చిన్న చిన్న కల్వర్టులు,తారు రోడ్లు,గ్రామదీపికల ద్వారా పాఠశాల భవనాల తాత్కాలిక మరమ్మతులు, ఆయా గ్రామ పంచాయతీ పరిధిలలో ఆ గ్రామాల అవసరం కోసం తీర్మానాలతో చేయిస్తున్న వివిధ రకాల పనులలో నాణ్యత్య లోపాలు ఉన్నాయని,నిర్మాణాలు ఎక్కువ కాలం ఉండవని,కాసుల కక్కుర్తి కోసం అలా జరుగుతుందని వార్తలతో పాటు ప్రజలలో చర్చసాగుతోంది.అసలు తప్పు ఎవరిది?
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
