Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు

పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైన చాపరాలపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె

మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు .
మండల పరిధిలోని
చాపరాలపల్లి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైందని , కుమ్మరిపాడు గ్రామానికి చెందిన పద్దం సుజాత ఇంటికి శుక్రవారం శంఖు స్థాపన చేసి పనులు ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన నిరుపేదలందరికీ 5 లక్షల రూపాయలతో పక్కాఇండ్లు నిర్మించటానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో జరిగిన బహిరంగ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తొలుత ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు చాపరాలపల్లి గ్రామ పంచాయతీలోని కుమ్మరిపాడు గ్రామంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పంచాయతీకి 65 ఇళ్ళు మంజూరయ్యాయని , ప్రతి ఒక్క లబ్ధిదారులందరూ నెల పదిహేను రోజుల్లో ఇళ్ళు పూర్తిచేయాలని , అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. నేరుగా లబ్దిదారుల ఖాతాలో ఐదు లక్షల రూపాయలు జమ చేయటం జరుగుతుందన్నారు .ఇళ్ళు రాని వాళ్ళు నిరాశ పడవద్దని ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇళ్ళు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ గద్దే రేవతి, ఎంఆర్ఓ పుల్లారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, చాపరాలపల్లి సెక్రటరీ కృష్ణ కాంత్, మాజీ సర్పంచ్ కారం సుధీర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షలు బానోత్ బాలాజీ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతనేని అమర్ నాథు, నల్లమోతు జగదీష్, తన్నీరు నాగేశ్వరరావు, నల్లమోతు వెంకయ్య, బాల అప్పారావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.