- అవసరమైతే తప్ప బయట తిరగకూడదు
- బిపి షుగర్ ఉన్నవారు ప్రతిరోజు మందులు వాడాలి
- ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు దగ్గరలోని ఆసుపత్రిని సంప్రదించాలి
- వికారాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకటరవణ
మన ప్రగతి న్యూస్/ వికారాబాద్ ప్రతినిధి :
వేసవికాలంలో వృద్ధులు చిన్నపిల్లలు అవసరమైతే తప్ప బయట తిరగకూడదని వికారాబాద్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ వెంకటరవణ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు వేసవికాలని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే తప్ప బయట తిరగకూడదని తెలిపారు. చిన్నపిల్లలు వృద్ధులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బీపీ షుగర్ ఉన్నవారు వేసవికాలంలో ప్రతిరోజు వారి మోతాదులో మెడిసిన్ తీసుకోవాలని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, 154 సబ్ సెంటర్లు కూడా ఉన్నాయన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు నాలుగు, బస్తీ దవకాన 4, యూపీఎస్ రెండు ఉన్నాయని అన్నారు. జిల్లా పరిధిలోని ఆయా మండలాల పరిధిలోని ఎండ తీవ్రతకు గురైనప్పుడు దగ్గరలోని చికిత్స అందించే హాస్పిటల్ లకు వెళ్లాలని తెలిపారు. ఎండ తీవ్రత వల్ల నీరసం సంభవించకుండా కొబ్బరి నీరు, ఫ్రూట్స్, జ్యూస్ లాంటివి తీసుకోవాలని అన్నారు. రానున్న ఎండల తీవ్రతను బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండలో ముదిరితే దాహం, జ్వరం, నీరసం, వాంతులు విరేచనాలు ఉన్నప్పుడు ఓ ఆర్ ఎస్ వినియోగించుకోవాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో, ఏఎన్ఎంల దగ్గర ఆశ వర్కర్,అంగన్వాడి సెంటర్లలో, అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎండ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్య సంభవించిన దగ్గరలో వైద్యం అందించే ఆస్పత్రి ఉన్నప్పుడు వెళ్లాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని పల్లె దావకాన డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దగ్గర్లో ఉన్న పల్లె దాకా నాకు వెళ్లాలని సూచించారు.