మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మండలంలోని రామతీర్థం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు . అందులో భాగంగా మండలంలోని రామతీర్థం గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది . ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే మాధవరెడ్డి భూమి పూజ చేసి ముగ్గులు పోశారు. అనంతరం మాట్లాడుతూ పేదోడి సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సహకారం అవుతుందని అన్నారు. ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రజలు ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదని సూచించారు. విడుతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఎవరు కూడా దళారులను నమ్మొద్దని అన్నారు. నేరుగా మీ బ్యాంకు ఖాతాలోనే ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో , స్థానిక ఎంపీడీవో, ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
