మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

పట్టణంలోని డఫోడిల్స్ సి బి ఎస్ సి హై స్కూల్ పాఠశాలలో పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా మహిళలందరికీ ఉచిత వైద్య శిబిరం పాఠశాల పూర్వ విద్యార్థులైన డాక్టర్లచే నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల మాతృమూర్తులతో పాటు బయటి మహిళలకు కూడా ఉచిత వైద్యాన్ని అందించారు.

షుగర్, బిపి, థైరాయిడ్ ,డెంటల్ , ఇతర పరీక్షలను నిపుణులైన డాక్టర్లచే పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించారు. చాలామంది మహిళలు సేవలను ఉచితంగా తమ ఆరోగ్య పరీక్షలను చేపించుకున్నారు. అనంతరం మహిళా దినోత్సవన్నీ పురస్కరించుకొని పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆటలలో గెలుపొందిన మహిళలకు,హాజరైన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళల శక్తి అమోఘమైనదని

వారు తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏది లేదని నేటి తరంలో మహిళలు చాలా ముందంజలో ఉన్నారని అన్నారు. ఒక మాతృమూర్తిగా, భార్యగా, సోదరిగా ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ కుటుంబాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఘనత మహిళకే దక్కుతుందన్నారు. నేటి మహిళలు అన్ని రంగాలలో సేవలందిస్తున్నారని తెలిపారు. పురుషునితో సమానంగా పోటీపడుతూ అన్ని రంగాలలో సేవలందిస్తున్నారన్నారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనంతుల అన్వేష్, డాక్టర్ రాజేశ్వరి,డాక్టర్ లక్మి వరణ్య, డాక్టరు సందీప్,డాక్టర్ అరవింద్,డాక్టర్ రాజ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ ,ఫార్మసిస్ట్ లతోపాటు పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రిట మేడం,హెచ్ ఓ డి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు , విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
