Breaking News

మహిళ మెడపై పుస్తెలతాడు దొంగలించే ప్రయత్నం దేహశుద్ధి చేసిన స్థానికులు.

మన ప్రగతి,/హత్నూర:

మహిళ మెడలో నుండి నాలుగు తులాల బంగారం పుస్తెలతాడు దొంగలించే ప్రయత్నం చేసిన దుండగుని స్థానికులు దేశ శుద్ధి చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. వివరాల్లోకి వెళ్తే హత్నూర మండలం నాగారం గ్రామానికి చెందిన చిప్పల్ తుర్తి సుగుణ భర్త ఆశా గౌడ్ అనే మహిళ మెడలో నుండి ఒక వ్యక్తి పుస్తెలతాడును దొంగలించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ మహిళ పుస్తెలతాడును గట్టిగా పట్టుకోని పరుపులు చేసింది. అటువైపు వెళుతున్న స్థానికులు దొంగలు పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. దుండగుడు సంగారెడ్డి జిల్లా రాంనగర్ కాలనీకి చెందిన వ్యక్తినని అతని పేరు విజయ్ అని తెలిపినట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని చర్యలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం