_ ఉద్యోగ భద్రత కల్పించాలి
మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్మికులు ర్యాలీగా బయలుదేరగా కార్మికులకు బిజెపి నాయకులు శ్రీనివాస్ రావు మద్దతు తెలిపారు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు వారి సమస్యల పై గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు కార్మికుల అకౌంట్లో వేస్తామని హామీ అమలు చేయలేదని పెండింగ్లో ఉన్న వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు ఎంపీడీవో కార్యాలయంలో
అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెండింగ్లో వేతనాలు చెల్లించాలని అలాగే ప్రతి నెల కార్మికుని అకౌంట్లో జీతాలు జమ చేయాలని కార్మికులకు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా ఎక్స్రేషియా వంటి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు చీప్నేర్ శ్రీనివాసరావు సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాస్, బాబు, లక్ష్మణ్, రాజయ్య, రాజు, సుధాకర్, బిక్షపతి, స్వరూప, అమృత, అన్ని గ్రామాల గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.