Breaking News

గ్రామపంచాయతీ సిబ్బందికి చీరల పంపిణీ…..

ఆత్మకూరు కాంగ్రెస్ మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి కాజా….

మన ప్రగతి న్యూస్/ ఆత్మకూరు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఖాజా పెళ్లిరోజు సందర్భంగా మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు ఖాజా భార్యాభర్తలను శాలువాతో సత్కరించి, పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎండి ఖాజా ఆత్మకూరు గ్రామపంచాయతీ సిబ్బందికి చీరలు, టవల్స్, స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులతో గ్రామంలో తన వంతు ఆర్థిక సహాయం చేస్తున్నానని, అన్నారు. ఈ కార్యక్రమంలో రేవూరి జలంధర్ రెడ్డి,పరికిరాల వాసు, నత్తి సుధాకర్, ఏరుకొండ రవీందర్ గౌడ్, కాడబోయిన రమేష్, అలువాల రవి, పెరుమాండ్ల బిక్షపతి, తనుగుల జంపయ్య, వడ్డేపల్లి వేణు, మండల నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.