మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట
ప్రతి ఒక్కరి జీవితంలో మహిళ ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది.ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా మహిళ యొక్క ప్రాధాన్యత మరిపించలేనిది.కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళ యొక్క ప్రాధాన్యతను గుర్తించి వారిని గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈరోజు మార్చ్ 8 న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అశ్వరావుపేట కేంద్రంలోని సయ్యద్
మియాజాని భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళా కామ్రేడ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సయ్యద్ మియా జానీ భవన్ లో కేక్ ను కట్ చేసి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రతి ఒక్క మహిళ ముందుకు వచ్చి పోరాటాల ద్వారా న్యాయం జరిగేలా చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం, మండల కార్యదర్శి గన్నిన రామకృష్ణ, మహిళా సంఘం నాయకులు చీపుర్ల సత్యవతి, కనితి శ్రావణి, పి దుర్గ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గద్ద సూర్య కుమారి, షేక్ రసూల్ బి, ఎం దుర్గ,వేమన లక్ష్మి మరియు సిపిఐ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు…