Breaking News

గోడౌన్ నిర్మించారు.. అసంపూర్తిగా వదిలేశారు

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ రూరల్:

ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన ప్రతి నిర్మాణం ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. కానీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కాదలాపూర్ గ్రామంలో మాత్రం రూ. 5 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోడౌన్ కేవలం కాంట్రాక్టర్ జేబులు నింపడానికి నిర్మించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గోడౌన్ ను అసంపూర్తిగా నిర్మించారు. గోడౌన్ కు షట్టర్, దారి లేకుండా నిరుపయోగంగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచడానికి ఉపయోగకరంగా మారుతుందని భావించిన గ్రామస్తులకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి గోడౌన్ ను ఉపయోగంలోకి తీసుకురావాలని రైతులు కోరారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం