Breaking News

జిల్లా పంచాయతీ అధికారిగా షర్పుద్దీన్

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో

జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) గా షర్ఫుద్దీన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ, అలాగే డివిజనల్ పంచాయతీ అధికారులకు జిల్లా పంచాయతీ అధికారిగా (రీడిప్లయోడ్) తిరిగి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో హన్మకొండ జిల్లా పరకాల డివిజనల్ పంచాయతీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న షర్ఫుద్దీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారిగా (రీడిప్లయోడ్) తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను శుక్రవారం కలిసి విధుల్లో చేరారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం