మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్
ఏన్కూరు మండలంలో సోమవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యంగళ నరేష్ మాదిగ అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్ష ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నరేష్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ పిలుపులో భాగంగాఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ఉద్యోగ పరీక్షా ఫలితాలు నిలిపేయాలని ఎస్సీల వర్గీకరణ ఏ బి సి డి లుగా చేసిన అనంతరం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందనీ, ఆగస్టు 1న సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అదే రోజు నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటన చేయడంతో పాటు,గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను వర్తింపజేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని స్పష్టమైన ప్రకటన అసెంబ్లీలో చేశారని గుర్తు చేశారు. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని చెప్పి మరో వైపు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని టీజీపీఎస్సీ నుంచి పత్రికల్లో ప్రకటనల చేయించటంతో మా జాతి ప్రజలు మరోసారి మోసానికి గురవుతారని,
ఒకవేళ అదే జరిగితే, మాదిగ లు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గొడ్ల రామకృష్ణ మాదిగ, మంగళ పూడి రాజ్ కుమార్ మాదిగ, పగిడిపల్లి సైదులు మాదిగ, కిన్నెర సురేష్ మాదిగ, చిలుకూరి రాజేష్ మాదిగ, ఏర్పుల సురేష్ మాదిగ, మారుబత్తుల రాకేష్ మాదిగ, యంగళ ప్రసన్నకుమార్ మాదిగ, సురేందర్ మాదిగ, కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.