Breaking News

*కమలానగర్ లో అగరంగా వైబావంగా శ్రీనివాసుని కళ్యాణం.

మన ప్రగతి న్యూస్ కాప్రా:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఈసీఐఎల్ పరిధిలోని కమలానగర్ లో తిరుమల శ్రీవారి సంకల్పించిన 111 కళ్యాణంలో భాగంగా 78వ శ్రీనివాస కళ్యాణం కమల నగర్ సీనియర్ సిటిజన్ గ్రౌండ్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు దశరథ మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం తిరుమల శ్రీవారికి సంకల్పించిన 111 కళ్యాణాలలో భాగంగా 78వ శ్రీనివాస కళ్యాణం ఈసీఎల్ కమల నగర్ సీనియర్ సిటిజన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం మాకు మహాభాగ్యంగా ఉందని అన్నారు. వైఖనస విద్యా నిలయం రొంపిచర్ల బట్టర్ శ్రీనివాస్ శ్రావణ స్వామి పంతులుచే శాస్త్రోత్తంగా శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు, కళ్యాణానికి వచ్చిన భక్తులకు కనువిందు చేసేలా పంతులు బృందం శ్రీనివాసుని కళ్యాణం భక్తిశ్రద్ధలతో సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై స్వామి వారి కళ్యాణానికి నూతన పట్టు వస్త్రాల ను ఆయన చేతుల మీదుగా అందించారు. శ్రీనివాసుని కళ్యాణంలో సీనియర్ సిటిజన్ కమిటీ మెంబర్లు అందరి సహకారంతో మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు, ఈ విందులో కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. శ్రీనివాసుని కళ్యాణంలో మహిళా భక్త బృందం కోలాటాలతో శ్రీనివాస్ ని కళ్యాణా నికి వచ్చిన భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తాడూరి శ్రీనివాస్, కొత్తరామారావు, మారి మోహన్ రెడ్డి, రమేష్ యాదవ్, కనుకుల రజనీకాంత్, ఇతర నాయకులు, కాలనీవాసులు, కమిటీ మెంబర్లు ఎల్లారెడ్డి, నారా యణ, పార్థసారథి, సంగయ్య, శ్రీనివాస్, రాజేశ్వర్, పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు.