మన ప్రగతి న్యూస్/ ఆత్మకూర్

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆత్మకూరు సిఐ సంతోష్ అన్నారు. మంగళవారం రోజున ఆత్మకూరు నుంచి వరంగల్ వెళ్ళే ఆర్ అండ్ బి రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా చేయించి, ప్రమాద సూచిక ( హెచ్చరిక) బోర్డులను ఏర్పాటు చేయించారు. సిఐ సంతోష్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై కుటుంబాలను ఆగం చేయవద్దన్నారు. మోటార్ సైకిల్ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
