ఒకరి మృతి
ఇద్దరికీ తీవ్రమైన గాయాలు
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నాగార్జున సాగర్ దెయ్యాల గండి మూల మలుపు సమ్మక్క సారలమ్మ సమీపంలో శనివారం రోజు అతి వేగంతో మద్యం మత్తులో హైదరాబాద్ నుండి గుంటూరుకు వెళుతున్న ఏపి 28 ఏవై 5229 నెంబర్ గల ఇన్నోవా కారు లో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు నడపడం తో అదే సమయంలో పిల్లి గుండ్ల తండా వాసులైనటువంటి బార్య భర్తలు, బావ మరిది చికిత్స నిమిత్తం నల్గొండ హాస్పిటల్ కి వెళుతున్న సమయంలో సమ్మక్క సారలమ్మ గుడి సమీపంలో కారు బలంగా బైక్ ను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే బైక్ మీద ఉన్నటువంటి సపావత్ బాబు రావు నాయక్( 28) బలంగా తలకు,మోకాలు కు దెబ్బలు తగలటంతో అక్కడికక్కడే మృతిచెందినట్లుగా , సపావత్ అనిత(24) కు చేతులు, కాళ్ళ ,వెన్నుపూస కు, నరేష్ ( 13)మోకాలు, కాళ్ళకు,తొడ ల మధ్య తీవ్రమైన గాయాలు కావడంతో హుటాహుటిన నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి కి పంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

క్షతాగాత్రుల ను ఆసుపత్రి డ్యూటి డాక్టర్ ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన బాబురావు నాయక్ ను పంచనామా నిమిత్తం పోస్ట్ మార్టం గదికి తరలించినట్లు గా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గా తెలియజేశారు.
