Breaking News

దామరచర్ల ప్రాజెక్టు పరిధి అంగన్వాడి సెంటర్లో శ్రీమంతాలు అన్న ప్రసరణ కార్యక్రమం

మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి

దామరచర్ల ప్రాజెక్టు పరిధిలోనే వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో అంగన్వాడి సెంటర్ 3 & 2 మరియు లక్ష్మీదేవి గూడెం సెంటర్ 1 మరియు సల్కు నూర్ 1 వేములపల్లి 2 అంగన్వాడి సెంటర్లో శ్రీమంతాలు ,అన్నప్రాసన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి డి పి ఓ చంద్రకళ మాట్లాడుతూ గర్భిణీలు తీసుకోవలసిన ఆహారము గురించి మరియు హెల్త్ చెకప్స్ ఆరోగ్యము , ఐరన్ టాబ్లెట్స్ ,తీసుకోవాలని ఆకుకూరలు ,పండ్లు, ఆరోగ్యలక్ష్మి భోజనం చేయాలని గర్భిణీలకు తెలియజేయడం జరిగింది. అంగన్వాడి సూపర్వైజర్ పరిమి రజిని మాట్లాడుతూ అన్నప్రాసన చేసినప్పటి నుంచి బిడ్డకు అదనపు ఆహారం రెండు సంవత్సరాలు వరకు తల్లిపాలు కొనసాగించాలని తల్లులకు తెలియజేసినారు.

ముచ్చటగా నాలుగోసారినాగార్జున సాగర్ డ్యాం వద్ధ చెలరేగిన మంటలు

ఈ కార్యక్రమంలో సిడిపిఓ చంద్రకళ సూపర్వైజర్ రజని , అంగన్వాడీ టీచర్ శారద, ఎలికట్టి కాంతమ్మ, జయశీల, జ్యోతి, ఆయాలు తల్లులు పాల్గొన్నారు. వేములపల్లి మండలంలో గల అంగన్వాడీ సెంటర్లలో శ్రీమంతాలు అన్న ప్రసరణ కార్యక్రమంలో తల్లులు గర్భిణీ స్త్రీలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.