Breaking News

హనుమాజీపేట్ లో హనుమాన్ విగ్రహం ధ్వంసం

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట్ గ్రామ శివారులో గల పెట్రోల్ పంప్ సమీపంలో మైడి హనుమాన్ విగ్రహం (టెంపుల్) దుండగులు ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి పరారయ్యారన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందజేశామని గ్రామస్తులు వాపోయారు. విగ్రహం ధ్వంసం కు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం