మన ప్రగతి న్యూస్ / ఆత్మకూరు
క్రికెట్ బెట్టింగ్ ను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ముక్కాల రాజును సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ ముక్కాల రాజు ఇంట్లో నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్పోర్ట్స్ పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ముకుమ్మడిగా దాడి చేసి 42 వేల ఒక వంద నగదు, సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు ముక్కాల రాజును అరెస్టు చేసినట్టు తెలిపారు. విచారణ నిమిత్తం ఆత్మకూరు పోలీసులకు ముక్కాల రాజును అప్పగించారు