మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జున సాగర్ డ్యాం పరిధిలో ముచ్చటగా నాలుగోసారి అగ్నిప్రమాదం జరిగి ఎర్త్ డ్యాం వద్ధ మంటలు చెలరేగిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నెల రోజులో నాలుగు సార్లు అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఫైర్ స్టేషన్ కు ఫోన్ ద్వారా సిబ్బంది కి సమాచారం ఇవ్వగా ఫైరింజన్ సహాయంతో మంటలు వ్యాపించకుండా వెంటనే ఆర్పివేయటం జరిగింది.ఈ సంఘటనతో ఎర్త్ డ్యాం పై ఉన్న సీసీ కెమోరాలు ,విద్యుత్ వైర్లు ద్వంసం అయ్యాయి, నాలుగు సార్లు ఒకే దగ్గర అగ్నిప్రమాదం జరిగినా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటాన్ని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.