మన ప్రగతి న్యూస్ / కీసర ప్రతినిధి:
ధమ్మాయిగూడా మున్సిపాలిటీ పరిధిలోని కుందన్ పల్లి శ్రీ రామలింగశ్వర్ కాలనీ సర్వే నెంబర్ 15 లో 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 80 గజాల స్థలం అర్హులైన వారికి ఇవ్వడం జరిగింది. ఆనాడు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక నేడు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంతంగా ఇల్లు నిర్మించుకుంటుంటే, ఇంటి నిర్మాణానికి అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు కూల్చివేయడం మరి విడ్డూరంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం 100 గజాల స్థలం లోపు ఇంటిని నిర్మించుకుంటే ఎటువంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం నిబంధనలు ఉన్నప్పటికీ కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఆర్థికంగా మమ్మల్ని నష్టపరిచి అధికారులు సాధించింది ఏమిటని బాధితులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదోడి కడుపు కొట్టి సాధించేది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పేదోడికి అండగా ఉండీ నిబంధనలు తెలియనప్పుడు తెలియపరచి సహకరించాల్సిన అధికారులు నిబంధనలు అతిక్రమించి కూలగొట్టడంలో ఉన్న మతలబు ఏంటని పలువురు బహటంగానే విమర్శిస్తున్నారు. మున్సిపల్ అధికారుల వివరణ కొరకు ప్రయత్నించగా ఫోన్ కు స్పందించలేదు.