Breaking News

కమలాపురం క్రాస్ రోడ్ వద్ద రిక్వెస్ట్ బస్సు స్టాప్ ఏర్పాటు చేయండి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట :

నర్సంపేట మున్సిపాలిటీ రెండో వార్డు కమలాపురం. గ్రామం క్రాస్ రోడ్ వద్ద నర్సంపేట నుండి మల్లంపల్లి మీదుగా ములుగు వెళ్లే బస్సులు, కమలాపురం మహిళలు ప్రజలు బస్సు ఎక్కి క్రాసు వద్ద ఆపమని అడుగుతే, ఆపకుండా ఇబ్బంది పెడుతున్నారన్న విషయాన్ని స్థానిక కౌన్సిలర్ జుర్రు రాజు యాదవ్ దృష్టికి తీసుకురావడంతో, ఈరోజు కౌన్సిలర్ లెటర్ ప్యాడ్ మీద వివరంగా రాసి, మహిళలతో సంతకాలు సేకరించి, నర్సంపేట డిపో మేనేజర్ ని కమలాపురం వివో అధ్యక్షురాలు వెన్నెల తో మరియు కొంతమంది మహిళలతో కలిసి లెటర్ ఇచ్చి, మా కమలాపురంలో 1200 పైచిలుకు పైచిలుకు జనాభా ఉందని తెలియజేస్తూ దయచేసి మా ఊరి క్రాస్ వద్ద రిక్వెస్ట్ బస్టాప్ ఏర్పాటు చేయాలని, బస్సు స్టాప్ కోసం మా ప్రజలందరూ ఇబ్బంది పడకుండా చూడాలని, కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమలాపురం మహిళలు బాసాని పద్మ నకిరెడ్డి సోమలచ్చమ్మ గాడుదుల మంజుల పోసాని కొమరమ్మ, పాల్గొనడం జరిగింది.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి