Breaking News

మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

మనప్రగతి న్యూస్/చిట్యాల

చిట్యాల మండలం వెంచరామి గ్రామానికి చెందిన తోట లక్ష్మణ్ సన్నాఫ్ భీమయ్య(28) ట్రాక్టర్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడాని తన అమ్మానాన్న చనిపోవడంతో అదే గ్రామంలో ఉన్న వాళ్ళ చిన్నమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు అని 5 వ తారీకు రోజున ఉదయం నుండి తన కంటే చిన్నవాళ్ళకి పెళ్లిళ్లు అవుతున్నాయని నాకు కావడం లేదని బాధపడుతూ ఉదయం నుండి మద్యం తాగుతూ రాత్రి 9 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంట్లో గల గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు అది గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల ఆసుపత్రికి తీసుకువచ్చి మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజిఎం కి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ 7 వ తారీకు రోజు రాత్రి 8 గంటల ముప్పై ఐదు నిమిషాలకు చనిపోయాడని మృతిని చిన్నమ్మ కూతురైన తోట లక్ష్మి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ జి శ్రవణ్ కుమార్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం