Breaking News

అందాల పోటీలు విడిది కోసం ముస్తాబవుతున్న విజయవిహర్

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

అందాల పోటీలను హైదరాబాద్ లో మే 7 తేది నుండి 31 వ తేది వరకు నిర్వహించటానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతిధి గృహాలను ఆధునికరించటానికి పూనుకున్న విషయం అందరికి తెలిసిన విషయమే, ఆధునికరణ లో భాగంగా నాగార్జున సాగర్ లోని విజయ విహార్ కు సంబందించిన గదులను సుమారుగా 6 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ కు రంగం సిద్ధం చేస్తూ త్వరితగతిన పూర్తి అయిన భాగాలకు రంగులు వేయటం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు 20 నుండి 25 రోజుల్లో ఆధునికీకరణకు సంబందించిన పనులు పూర్తి అవుతాయని తెలుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో నాగార్జున సాగర్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులకు సమాచారం ఇవ్వటానికి పూర్తి స్థాయిలో,టూరిజం సమాచార కేంద్రం, కూడా ఇప్పుడు పని చేయకుండా ఉండటం పర్యాటకులను అసహనానికి గురి చేస్తోంది, పర్యాటకులు వచ్చినప్పుడు కనీస అవసరాలు తీర్చుకోవటానికి మౌళిక వసతులు లేవని హిల్ కాలనీ బస్ స్టాప్ లో మరుగుదొడ్లు అందుబాటులో లేవని ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు,వృద్ధులు సేద తీర్చుకోవడానికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా అందాల పోటీలను నిర్వహించటం ఎంత వరకు సబబు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు,మానవ అవసరాలు తీర్చుకోవటానికి ప్రభుత్వ అధికారులు ఆలోచిస్తే బాగుంటుందని పట్టణ ప్రజలు సంఘసంస్కర్తలు తెలియచేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం