మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్
మతిస్థిమితం లేని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని హిమామ్ నగర్ గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది . పోలీసుల కథనం ప్రకారం గ్రామ సమీపంలోని కోళ్ల ఫారం ఎదురుగా మృతి చెంది ఉన్న వ్యక్తి మృతదేహాన్ని కోళ్ల ఫారం లో పనిచేసే వ్యక్తి ఉదయం చెత్తను పడేసేందుకు పోగా వ్యక్తి శవం కనిపించడంతో పోలీసులు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపాడు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించాడు. మతిస్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించారు. వికలాంగుడిగా,. కుడి చేయి లేదని, ఒంటిపై కేవలం నిక్కర్ మాత్రమే ఉందని పోలీసులు గుర్తించారు.. మృతుడికి సుమారు (45) సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.మృతదేహాన్ని ఖమ్మం అన్నం పౌండేషన్కు అందజేశారు. ఎస్సై రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.