Breaking News

రాజీవ్ యువ వికాసం పథకంలో రిపోర్టర్లకు ప్రాధాన్యత కోరుతూ ఎంపీడీవో కి వినతి

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తరపున, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన రిపోర్టర్లకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ ఏన్కూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో ఎస్ రమేష్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏన్కూర్ మండల జర్నలిస్టులు జుజ్జురి కృష్ణమాచారి, కంభంపాటి శ్రీనివాసరావు, ఎం ఎస్ గోపాలరావు, బి గోపికృష్ణ, జి బావు సింగ్ నాయక్, ఇ నరసింహ, ఎలుగోటి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం