. అకాల వర్షానికి ఆగమైన రైతన్నలు
. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి
మన ప్రగతి న్యూస్ /రామన్నపేట:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నంల గ్రామంలో మంగళవారం 6 గంటల సమయ సాయంకాల వేళ అనుకోకుండా వడగండ్ల వాన రావడంతో మార్కెట్ ఉన్నపరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరై రైతన్న అటు కోసిన పంట వడ్లను కుప్పపోసుకోలేక, కోయని పంట పొలాన్ని కాపాడుకోలేక ఆ రాళ్ల వానకు వడ్లు కాస్త రాలిపోయినాయి ఆరుకాలం కష్టం కష్టపడి పంట పండించిన రైతన్న నోట్లో మట్టి పడినట్టు వడగండ్ల వాన చేసింది.రైతన్న నోట్లో వానదేవుడు వలగండ్ల వానల కురిపించాడు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని నష్టాలు ఉన్న రైతుకు మాత్రం పంట చేతికి వచ్చి అమ్ముడుపోయిన దాకా కూడా బాధలు తప్పవు వడ్లు రాలిన రైతులు వారి యొక్క బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చేతులు జోడించి దండం పెడుతున్నారు.ఓ రైతన్న దేశానికి వెన్నుముకనే నీవన్న, ప్రతి వ్యక్తికి లేదనకుంట తిండి పెట్టే కనిపించే దేవుడు అంటున్నారు కానీ రైతుకు తీరని కన్నీటి బాధ,నీవు చెప్పుకోలేని ఒక వేద,తన శ్రమకు తగ్గని ఫలితనం, అయినా సరే నేను ఒక గొప్ప రైతును అని దండం పెడుతూ ప్రభుత్వాన్ని ఆదుకోమని అడుగుతున్నారు.