Breaking News

మహాలక్ష్మి ట్రేడర్స్ లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సొత్తు స్వాదినం

–వివరాలు వెల్లడించిన డిఎస్పీ తిరుపతి రావు–

మన ప్రగతి న్యూస్/కేసముద్రం:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 8 న అర్ధ రాత్రి సమయంలో కేసముద్రం మెయిన్ రోడ్ లోని ఏ మార్ట్ పక్కన గల మహాలక్ష్మి ట్రేడర్స్ కంపెనీలో దొంగతనం జరగగా అట్టి విషయంలో బుధవారం నాడు ఉదయం బోడ మంచ్య తండ సమీపంలో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో దొంగతనం చేసిన నేరస్తుడు అగు గుగులోతు నవీన్, తండ్రి నాందేవ్,22 సం” రతిరాం తండ,నెల్లికుదుర్ మండలం అను వ్యక్తిని పట్టుకొని సదరు దొంగ నుండి రూపాయలు ఐదు లక్షల కు పైగా నగదు మరియు కొత్త పల్సర్ బైక్, రెండు బంగారం రింగులు,ఒక వెండి బ్రాస్లెట్,ఒక మొబైల్ ఫోను స్వాధీనపరచుకొని అట్టి దొంగను బుధవారం రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
ఇట్టి దొంగతనం విషయంలో ప్రతిభ కనబరిచినటువంటి మహబూబాబాద్ డి.ఎస్.పి తిరుపతి రావుని,రూరల్ సి ఐ సర్వయ ని, సిసిఎస్,సీఐ హతిరంని,సి సి ఎస్ ఎస్సై తహేర్ బాబా,కేసముద్రం ఎస్సై మురళీ ధర్,కరుణాకర్ ఎస్సై ను,రాం చందర్, మరియు కానిస్టేబుల్ లను జిల్లా ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ అభినందించడం జరిగింది..