నిందితులను చాకచక్యంగా పట్టుకున్న నాగార్జున సాగర్ పోలీసులు
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ 2-04-2025 రోజున స్థానిక సత్యనారాయణ గుడి సమీపంలో కొందరు వ్యక్తులు హరిచంద్ర (60)అనే వ్యక్తి ని కిడ్నాప్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మాచర్ల మండలంలోని పశువేముల గ్రామం లో చంపివేసిన సంఘటన అందరికి తెలిసిన విషయమే, ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న నాగార్జున సాగర్ విజయ పురి పోలీసు శాఖ వారు మూడు బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా వ్యవహరించి నిందితులను కేవలం 6 రోజుల వ్యవధిలోనే పట్టుకోవటం జరిగింది. వివరాల్లోకి వెళితే బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ కే.రాజశేఖర్ రాజు మాట్లాడుతూ కేసు యొక్క పూర్వపరాలు మీడియాకు తెలియచేస్తూ పండ్ల నిర్మల తన తన భర్త అయినటు వంటి పండ్ల హరిచంద్ర ను పశువేముల గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసారని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయటం జరిగింది ఈ కేసును మేము ఒక చాలెంజ్ గా తీసుకొని క్రైం నెంబర్ 41/2025 లో నమోదు చేసి సీఐ నాగార్జున సాగర్ , ఎస్సై విజయపురి, పెద్ద వూర ఎస్సై ల ఆద్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి అన్ని ప్రాంతాల్లోని సీసీటీవి ల యొక్క ఫుటేజ్ లను పరిశీలించిన అనంతరం నేరస్తులను గుర్తించి ఈ కేసులో ఏ-1 గా ఉన్న ముద్ధాయి బెజవాడ కోటమ్మ ను 7 వ మైలు రాయి వద్ధ అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. పూర్వపరాల విచారణ అనంతరం తెలిపిన వివరాల ప్రకారం కోటమ్మ కు వరుసకు కుమారడైనటువంటి బెజవాడ బ్రహ్మం కు మృతుడు కూతురుతో గత పది సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని కుటుంబ కలహల కారణంగా రెండు కుటుంబాల సభ్యులు మద్య తరుచుగా జరుగుతుండేవి వారిరువురు గొడవలు పడి దాడి చేసుకోగా ఆ దాడిలో కోటమ్మ కుమారుడు( రమేష్) ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని మృతుడు మీద అతని కుటుంబ సభ్యుల మీద విజయ పురి సౌత్( రైట్ బ్యాంకు)పోలీసు స్టేషన్ లో అప్పట్లో కేసు నమోదు చేయటం జరిగింది.అప్పటి నుండి మృతుడు ప్రాణ భయంతో నల్గొండ జిల్లా లోని కనగల్ గ్రామానికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బార్య పిల్లలతో తలదాచుకొని గుట్టుగా ఉంటున్నాడు,అప్పటి నుండి కోటమ్మ అతని కుటుంబ సభ్యులు మృతుడి మీద కక్ష్య పెంచుకొని అతనిని ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయించుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నా క్రమంలో మృతుడు హరిచంద్ర గత నెలలో కనగల్ నుండి నాగార్జున సాగర్ కు వచ్చి పెన్షన్ తీసుకొని వెళ్తుతున్నాడని విషయం గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ నాగయ్య ద్వార తెలుసుకొని పశువేముల గ్రామం నుంచి నేరస్తులైనటు వంటి బెజవాడ వెంకటేశ్వర్లు, వెంకన్న, పండ్ల కోటేశ్వరరావు,కోటి బెజవాడ కోటమ్మ,పోచమల్లు మహేష్,భార్గవ్ లు రెండు బైకు ల మీద పైలాన్ కాలనీలోని ఆటో స్థాండ్ వద్ధ కు వచ్చి ఎదురు చూస్తుండగా అప్పటికే మారుతి షిఫ్ట్ తో వారి కోసం ఎదురు చూస్తున్న మరో నేరస్తుడు నేల పట్ల భాస్కర్ తన కారులో కోటమ్మ, వెంకటేశ్వర్లు, వెంకన్న ను ఎక్కించుకొని వెంట తెచ్చుకున్న కత్తులను కారులో ను భార్గవ్ బైక్ లోను పెట్టుకుని షైని బండి మీద హిల్ కాలనీ కి స్థానిక సత్యనారాయణ గుడి ప్రాంగణం నకు వచ్చి హరిచంద్ర కొరకు ఎదురుచూస్తూండగా ఆ సమయంలో నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న మృతుడు కనిపించాడని దగ్గర వచ్చే వరకు వేచి ఉండి అకస్మాత్తుగా మృతుడిని బలవంతంగా కొట్టు కుంటు కారులో ఎక్కించుకొని మాచర్ల వైపు ఉన్న ఎత్తి పోతల చెక్ పోస్ట్ దాటిన తర్వాత కారును త్రిప్పి చెంచురాంపురం దాటిన తర్వాత కిలో మీటర్ ముందుకు వెళ్ళి కారును రోడ్డు ఎడమ వైపు కు ఆపి ఒకే సారి ఐదుగురు నేరస్తులు మృతుడిని కారులోంచి దించి కొట్టుకుంటు ఆ ప్రక్కనే ఉన్న బీడు పొలంలోకి సుమారు గా 20 అడుగుల లోపలికి తీసుకొని వెళ్ళి ఎడుమ వైపు కు కారు ను ఆపటం జరిగింది, అప్పుడే అక్కడ కు చేరుకున్న బెజవాడ బ్రహ్మం అందరు కలిసి హరిచంద్ర ను కారులోంచి దించి కొట్టి క్రింద పడవేసి పెద్ద పెద్ద గుండు రాళ్ళను మృతుడి తల మీద బలంగా మోది అతి దారుణంగా హత్య చేయటం జరిగింది, రాళ్లతో గట్టి గా కొట్టడం వలన తల పగిలి తీవ్ర స్థాయిలో రక్త స్రావం అయి మృతుడు అక్కడికక్కడే చనిపోయాడని అక్కడి నుండి భాస్కర్, భార్గవ్,కోటి , వెంకన్న లు అదే కారులో వాడపల్లి మీదుగా హైదరాబాద్ పారిపోగా కోటమ్మ,బెజవాడ బ్రహ్మం ఊరిలోని కి పారిపోవడం జరిగిందని ఈ క్రమంలో 8-4 – 2025 తనీఖీలో బాగంగా నిందితుల కోసం గాలిస్తుండ గా విశ్వసనీయ సమాచారం మేరకు మధ్యాహ్నం హత్యలో పాల్గొన్న నిందితులతో పాటు వారికి ఆశ్రయం ఇచ్చిన నేల పట్ల బ్రహ్మం ,చంటి, మట్టపల్లి కోటేశ్వరరావు అందరు కారులో అడ్వకేట్ ను కలవడానికి మాచర్ల వైపు వెళ్తుండగా నాగార్జున సాగర్ ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ఆరుగురు నేరస్తులను అరెస్ట్ చేయటం జరిగినది వీరు ఇచ్ఛిన సమాచారం మేరకు హత్య తో సంబంధం ఉన్న బెజవాడ బ్రహ్మం, దోసపాటి నాగయ్య,లను రైట్ బ్యాంకు లో ఉన్న మాతా సరోవరం హోటల్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఒక సందర్భంలో నిందితులు తరుచుగా సిమ్ కార్డ్ మార్చి తన బంధువులకు ఫోన్ చేసి వెంటనే స్విచ్చాఫ్ చేసేవారని అయిన సరే నిందితులను పట్టుకోవటం జరిగిందని, నిందితుల నుంచి ఒక కారు ,రెండు బైక్ లు ,10 సెల్ ఫోన్లు, 2 కత్తులను స్వాదీనం చేసుకోవటం జరిగిందని అన్నారు,ఈ కేసు లో నూతనంగా సీఐ గా చార్జీ తీసుకున్న శ్రీను నాయక్ 10 రోజులోనే అత్యంత కీలకమైన కేసును చేధించినందుకు అదే విధంగా ఎస్సై సంపత్ గౌడ్, వీరబాబు,వీర శేఖర్ ,వెంకట స్వామి ,హేమంత్, వెంకన్న,రామకోటి , దావీదు, ప్రశాంత్, రాంప్రసాద్, శ్రీకాంత్,నరసింహ,లను డీఎస్పీ రాజశేఖర్ రాజు ప్రత్యేకంగా అభినందించటం జరిగింది, నిందితులను కోర్టులో ప్రవేశ పెడుతున్నట్లుగా తెలియజేశారు.