Breaking News

ఏన్కూరు గురుకుల విద్యార్థుల ప్రభంజనం

రాష్ట్ర స్థాయి ర్యాంకుల సాధన

ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో అద్భుత ప్రతిభతో విజయఢంకా మోగించిన విద్యార్థులు

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ఏన్కూరు గురుకుల కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి ర్యాంకుల సాధనతో ప్రభంజనం సృష్టించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో తీర్థం శ్రీ వెంకట ఆంజనేయ 470లో 468 మార్కులతో, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎస్. మహేష్ 1000లో 995 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం


మొదటి సంవత్సరం ఎంపీసీలో 43 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందరూ ఉత్తీర్ణత సాధించారు. వీరిలో హృతిక్ కుమార్ 467, జి. కళ్యాణ్ 466 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 40 మందిలో 39 మంది ఉత్తీర్ణులయ్యారు,

వీరిలో కె. రోహిత్ 993, జి. వెంకటేష్ 988 మార్కులు పొందారు. ఇక బైపీసీ విభాగంలోనూ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో 21 మంది అందరూ ఉత్తీర్ణత సాధించగా, కె. గోవర్ధన్ 988, కె. సిద్ధార్థ 987 మార్కులతో రాణించారు. ప్రథమ సంవత్సరం బైపీసీలో 34 మందిలో 33 మంది ఉత్తీర్ణులయ్యారు. డి. రాఘవేంద్ర, ఎస్. హరీష్ 430 మార్కులు, కె. నాగ వెంకట్, లిఖిల్ 429 మార్కులతో సత్తా చాటారు.
ఈ అద్వితీయ విజయం సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ తుడి శ్రీనివాసరెడ్డి, లెక్చరర్లు, ఉపాధ్యాయులు అభినందించారు.