Breaking News

పట్టణ కేంద్రంలో పోలీసు విస్తృత తనిఖీలు

శాంతిభద్రత పరిరక్షణలో ప్రజలు సహకరించాలి పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు

తనిఖీల్లో పాల్గొన్న డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసు

జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మన ప్రగతి న్యూస్ సూర్యాపేట
జిల్లా స్టాపర్

అక్రమ రవాణా నిరోధించడం లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో కొత్త బస్టాండు హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలలో రద్దీ ప్రాంతాలు ఫ్లై ఓవర్స్, ముఖ్యమైన వాణిజ్య సముదాయాలలో పోలీసులు విసృత తనిఖీలు నిర్వహించారు. బస్సులు నిలుపు ప్రాంగణాలను దుకాణాలు బస్సులు, ప్రయాణికుల లగేజీ అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి భద్రతా చర్యల పట్ల పట్టణ సీఐ వీర రాఘవులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుతూ ప్రధాన జాతీయ రహదారిపై రవాణా పరంగా ముఖ్య కేంద్రంగా ఉన్న సూర్యాపేట పట్టణంలో మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలు గుర్తించడం లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని అన్నారు. గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులకు, అనుమానితులు లాడ్జ్ ల నందు వసతి ఇవ్వవద్దు అని కోరారు. శాంతిభద్రతల రక్షణలో ప్రజలు పోలీసులతో సహకరించాలి అని కోరారు. గంజాయి డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేశామన్నారు. మాదకద్రవ్యాలు గుర్తించే డాగ్ పేలుడు పరదర్ధాలు గుర్తించే డాగ్ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొని బస్సులు అనుమానిత వస్తువులు ప్రయాణికుల బ్యాగులు తనిఖీలు చేయడం జరిగినది.
ఈ తనిఖీల్లో సీఐ వీర రాఘవులు, ఎస్సై ఆంజనేయులు ఆర్ఎస్ఐ మహేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.