Breaking News

రామన్నపేట పట్టణానికి చెందిన కొప్పుల ఉజ్వలకు డాక్టరేట్

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణానికి చెందిన కొప్పుల ఉజ్వల ఇంగ్లీషులో ఇంగ్లీష్ లిటరేచర్ లో పరిశోధన అంశము ఎక్స్‌ప్లోరింగ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ మరియు అకడమిక్ ఎక్సలెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అట్ ది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనే అంశంపై డాక్టర్ మెలిస్సా హెలెన్ అసోసియేట్ ప్రొఫెసర్ మార్గదర్శకంలో పూర్తి చేసి పరిశోధన పత్రము సమర్పించగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం గుర్తించి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పి హెచ్ డి నెంబర్.45703) ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఉజ్వల రామన్నపేట పట్టణంలోని విజ్ఞాన వర్ధిని హై స్కూల్ 1999-2000 లో పదవ తరగతి ఆపై పీజీ తో పాటు,ఈ ఎఫ్ ఎల్ యు నందు పి జి డి టి డి ఈ మరియు ఎంఫిల్ పూర్తి చేసింది.ప్రస్తుతం ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలలో ఘట్కేసర్ నందు ఇంగ్లీష్ లెక్చరర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పి హెచ్ డి పూర్తి చేయడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఉజ్వల డాక్టరేట్ పొందిన సందర్భంగా కుటుంబ సభ్యులు,ఉపాధ్యాయులు,మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం