మన ప్రగతి న్యూస్ /పెద్ద శంకరంపేట రిపోర్టర్ బాలరాజు
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం పరిధిలోని విరోజ్ పల్లి గ్రామంలో జిల్లా విజిలెన్స్ అధికారులు బుధవారం ఐకేపీ సెంటర్ ను సందర్శించారు. రైతుల ఫిర్యాదు మేరకు ఐకెపి సెంటర్లకు వచ్చి తుకంలో రైతులకు జరుగుతున్న అన్యాయాం గురుంచి రైతులను అడిగి తెలుసుకున్నారు.తూకంలో ఎలాంటి అవకతవకలు జరిగిన అధికారులపై తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామనీ రైతులకు తెలియజేశారు. ఇకపై తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని మండల అధికారులకు సూచనలు ఇచ్చారు. రైస్ మిల్లర్లు ఐకేపీ లో కాంట జరిగిన వడ్లుకు తరుగు తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.రైతులకు న్యాయం జరిగేలా రైస్ మిల్లర్ల యజమానులకు సూచనలు ఇవ్వాలని రైతుల అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారులు అడిషనల్ ఎస్పీ ద్రోణాచార్యులు, ఎస్సై వెంకటేశ్వర్లు, సాంబశివులు, తహసీల్దార్, ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి, రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షులు కందుకూరి రవి, ఏపీఎం గోపాల్, రమేష్ సెట్ తదితరులు పాల్గొన్నారు.