Breaking News

సంగారెడ్డి జిల్లాలో తల్లి కొడుకుల దారుణ హత్య

మన ప్రగతి న్యూస్/జిన్నారం

సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో తల్లి కొడుకుల హత్య కలకలం రేపింది. వీరభద్రనగర్ కాలనిలో గురువారం ఉదయం తల్లి కొడుకును నాగరాజు అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్యచేశాడు. మృతులు తల్లి కొడుకులు సరోజదేవి (50), అనిల్ (30) గా గుర్తింపు. వీరు యూపీకి చెందిన వారుగా గుర్తించారు. కత్తితో దాడి చేసిన వ్యక్తి నాగరాజు బీహార్ రాష్ట్రనికి చెందిన వాడిగా గుర్తించారు. పాతగొడవలే హత్యకు కారణమని స్థానికులు అంటున్నారు.
తల్లి కొడుకులను ఎందుకు చంపావని స్థానికులు నాగరాజును ప్రశ్నించగా నా కొడుకును చంపారు.. అందుకే చంపాను అంటూ కోపంతో రగిలిపోయాడు. అంతేకాకుండా.. తన భార్యపై కూడా మృతులిద్దరు దాడి చేసేందుకు ఇంట్లోకి వచ్చారని అందుకే చంపానని తెలిపాడు. నా 2 సంవత్సరాల కొడుకు చావుకి కారకులు వీళ్ళే అని, వీరిపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఇవాళ వీరిద్దరిని నాగరాజు హత్య చేసినట్లు అందరి ముందు తెలిపాడు. స్థానిక సమాచారంతో పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని నాగరాజును అరెస్ట్ చేశారు.మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం