బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

బాలల దినోత్సవం వేడుకలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు

బాలల దినోత్సవం వేడుకలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు

మన ప్రగతి న్యూస్/ పిట్లం:

పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వాతంత్ర్య సమరయోధులు నవభారత నిర్మాత భారత దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి మనమందరం వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కుల,మత,వర్గ బేధాలు లేకుండా విద్యార్థులు అందరూ సోదర భావంతో మెలగాలని సూచించారు.
దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం జరుగుతుంది
కాబట్టి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని అన్నారు.బాలల్ని సక్రమ మార్గంలో నడిచేలా చేస్తే దేశం కూడా అదే బాటలో పయనిస్తుందనడంలో సందేహం లేదని తెలిపారు.నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారి హక్కులను కాపాడటం, బాధ్యత గల పౌరులుగా వారిని తీర్చిదిద్దడం మన బాధ్యత అని అన్నారు.
బాలల హక్కులను కాపాడేందుకు సంకల్పం చేద్దాం. సామాజిక, ఆర్ధిక బలహీనతలు బాలల దరికి చేరకుండా వారికి మంచి భవిష్యత్ ను అందిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి అర్చన, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లప్ప పటేల్, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు .

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం